బోయిన్‌పల్లిలో పోలీసుల నుంచి ఖైదీ పరారీ
విచారణ నిమిత్తం తరలించిన రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఖైదీలను మరో కేసులో పీటీ వారెంట్‌పై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనం ఆగిన సమయంలో, ఖైదీ నరేష్ అనే వ్యక్తి వాహనం నుంచి దూకి అక్కడి నుంచి పారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
పోలీసులు ఖైదీలను ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
సారాంశం
విచారణ నిమిత్తం తరలించిన రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ట్రాఫిక్ జామ్‌ను అదనుగా చేసుకుని వాహనం నుంచి దూకి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
#ఖైదీ పరారీ#బోయిన్పల్లి#చంచల్‌గూడ జైలు#పోలీసులు#దొంగతనం కేసు